వార ఫలాలు : 2024 మార్చి 03 నుంచి 09 వరకు

మేషం : ఆలోచనలకు కార్యరూపం. రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. మీసత్తా అందరిలోనూ చాటుకుని ప్రశంసలు పొందుతారు. విద్యావకాశాలు మరింతగా దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. గృహ, వాహనయోగాలు కలిగే సూచన. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారవచ్చు. వ్యాపారులకు ప్రోత్సాహకరం. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయవేత్తలు, పరిశోధకులకు మంచి గుర్తింపు.

వృషభం :  ఆదాయం పెరుగుతుంది. పోటీపరీక్షలపై విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు చివరి దశకు చేరతాయి. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఎదుటివారిని నొప్పించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యాలు విజయవంతం. కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారులకు ఆశించిన పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే.

మిథునం : ఆలోచనలు అమలుచేస్తారు. మీ నిర్ణయాలపై కుటుంబంలో అనుకూలత వ్యక్తమవుతుంది. సకాలంలో రావలసిన డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు తిరిగి దక్కే అవకాశం. మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు నైపుణ్యత చాటుకుంటారు.

కర్కాటకం :  ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. మాటలతో అందర్నీ ఆకట్టుకుంటారు. వాహన, గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులు సత్తా నిరూపించుకుంటారు. రాజకీయవేత్తల, కళాకారుల, వైద్యుల కృషి ఫలిస్తుంది.

సింహం : అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి.  ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సోదరులు, సోదరీలతో వివాదాల పరిష్కారం. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు అనుకూల సమయం. 

కన్య : చేపట్టిన కార్యక్రమాలను పూర్తిచేసేవరకూ విశ్రమించరు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. అనుకున్న రాబడి వచ్చి ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో చిక్కులు పరిష్కరించుకుని లబ్ధిపొందుతారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతమైన సమయం.

తుల : ముఖ్యకార్యాలు సజావుగా పూర్తి. రాబడికి లోటు ఉండదు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఆలోచనలకు కార్యరూపం. చీటికీ మాటికీ వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించే సూచన. వాహన, గృహయోగాలు. వ్యాపారులు నష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు సహచరులనుంచి సాయం. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

వృచ్చికం : ఆశించిన ఆదాయం. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కలసి వస్తాయి. అందరిలోనూ మీమాటే నెగ్గుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో గందరగోళం తొలగుతుంది. శత్రువులు కూడా మీపట్ల విధేయత చూపుతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై సన్నద్ధం. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఉత్సాహంగా చేపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. 

ధనస్సు : కొన్ని కార్యాలు కుటుంబ సభ్యుల సాయంతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులు లాభాల దిశగా అడుగులేస్తారు. ఉద్యోగులకు విధినిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు అందుతాయి.

మకరం :  ఆప్తులు కొందరు వ్యతిరేకత చూపినా చివరికి మీదారికే వస్తారు. చేపట్టినకార్యాలు విజయవంతం. సోదరులు, సోదరీలతో ముఖ్య విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వాహన యోగం. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు.  వ్యాపా రులకు ఎక్కువ లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఆశాజనకం.

కుంభం : చేపట్టిన కార్యాలు సమయానికి పూర్తి. ఆలోచనలకు కార్యరూపం. ఆత్మీయుల సలహాలమేరకు నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. రెండు మూడు విధాలుగా ధనలాభాలు కలిగే అవకాశం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులు విధినిర్వహణలో సత్తాచాటుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు.

మీనం : జీవితాశయం సాధించే దిశగా ముందడుగువేస్తారు. ఆదాయం పెరుగుతుంది. భూవివాదాలు కొంత మేర పరిష్కారం. దీర్ఘకాలికంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కోర్టు వ్యవహారం కొలిక్కివస్తుంది. వాహన యోగం. విద్యార్థుల యత్నాలు సఫలం. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలించే సమయం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు విధినిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకులు, రాజకీయవేత్తలకు సన్మానయోగం.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400