చోరీ ఫోన్ల ఆచూకీ కోసం వెబ్ పోర్టల్

చోరీ ఫోన్ల ఆచూకీ కోసం వెబ్ పోర్టల్

న్యూఢిల్లీ: ఫోన్లను పోగొట్టుకున్న వారికి సాయం చేసేందుకు రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌‌ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఇది చోరీ అయిన ఫోన్లను బ్లాక్‌‌ చేస్తుంది. వాటి ఆచూకీ కనుక్కోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఈ పోర్టల్‌‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ముంబైలో ప్రారంభించారు. ఇప్పుడు ఢిల్లీ, ఎన్సీఆర్‌‌ ప్రాంతవాసులకు కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఐదు కోట్ల మందికి మేలు జరుగుతుందని అంచనా. వచ్చే ఏడాది మిగతా నగరాలవాసులు www.ceir.gov.in పోర్టల్‌‌ను ఉపయోగించుకోవచ్చు. ట్రేసింగ్‌‌ డేటాను ఇది పోలీసులకూ అందజేస్తుంది కాబట్టి పోయిన ఫోన్‌‌ దొరికే అవకాశాలూ ఉంటాయి. ఫోన్‌‌ పోగొట్టుకున్న వాళ్లు ఈ పోర్టల్‌‌ ఓపెన్‌‌ చేసి పోలీసు ఫిర్యాదు కాపీ, ఐడీ ప్రూఫ్‌‌లతో కంప్లెయింట్‌‌ ఫైల్‌‌ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఆ ఫోన్‌‌ను బ్లాక్‌‌ చేస్తారు. టవర్‌‌ సిగ్నల్స్‌‌ ఆధారంగా అది ఏ ప్రాంతంలో ఉందో కనిపెడతారు. ఈ సేవల వల్ల దొంగఫోన్ల అమ్మకాలు/ కొనుగోళ్లు కూడా తగ్గుతాయి.