ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌లో వెదర్ అప్‌‌‌‌డేట్‌‌‌‌కు వెబ్‌‌‌‌పేజీ

లక్నో: మహా కుంభమేళాకు ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌ రెడీ అవుతున్నది. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి 40 కోట్ల మంది వస్తారనే అంచనాల నేపథ్యంలో అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌కు వచ్చే భక్తులు ఎప్పటికప్పుడు అక్కడి వెదర్ గురించి తెలుసుకునేందుకు ఇండియా మెటీరోలాజికల్ డిపార్ట్ మెంట్(ఐఎండీ) ప్రత్యేక వెబ్‌‌‌‌పేజీని ప్రారంభించింది. ప్రతీ15 నిమిషాలకు ఒకసారి  ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌ వాతావరణం గురించి తెలుసుకోవచ్చని ఐఎండీ డైరెక్టర్ మనీశ్ రణాల్కర్ శుక్రవారం వెల్లడించారు.