Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో అతిభారీ వర్షాలు పడే ఛాన్స్..

ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రం పై ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం ( నవంబర్ 23, 2024 ) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తదుపరి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.దీని ప్రభావంతో మంగళ, బుధవాాారాల్లో (నవంబర్ 26,27న) కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని..  రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

భారీ వర్షాల వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ .రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని సూచించింది.

ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లోద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.