AI Friend necklace:ఫ్రెండూ, ట్రెండూ.. ఒక్కటై ఇలా : ఫ్రెండ్‌షిప్ కోసం AI పవర్డ్ నెక్లెస్ 

ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే అని అంటారు కదా, కానీ ఇప్పుడు ట్రెండూ, ఫ్రెండూ కలిసి ఓ మిక్సిడ్ ప్యాక్‌లో వస్తుంది. ఏంటా  అనుకుంటున్నారా? ఫ్రెండ్ షిప్ కోసం కొత్తగా మార్కెట్లోకి AI పవర్డ్ నెక్లెస్ వచ్చింది గురూ.. ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు, అలా అని ఎప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండడానికి, మనతో మాట్లాడడానికి, చెప్పింది వినడానికి మంచి ఫ్రెండ్ ను ఏఐ చాట్ బాట్ రూపంలో తీసుకోచ్చారు.

ఇది మెడ చుట్టూ ధరించగలిగే ఏఐ ఆధారిత లాకెట్టు పరికరం.  ఇది మనకు రియల్ మావన కనెక్టివిటీని భర్తీ చేయలేకపోయినా.. మనం ఒంటిరిగా లేం అనే అనుభూతిని ఇస్తుంది. మనం చెప్పింది వింటుంది.. ఏం అడిగినా తిరిగి మనకు మళ్లీ చెప్తుంది. మీరు మీ సీక్రెట్స్ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటే.. ఎప్పుడైనా విభేదాలు వస్తే.. అవి లీక్ చేస్తారు.. కానీ ఈ ఫ్రెండ్ నెక్లెస్ చచ్చినా మీ పర్సనల్స్ ఇతరులకు చెప్పదు. దీని ధర రూ.8వేలు. ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి మరి.