మేం ఓట్లు వేయం.. మూడు రోజుల నుంచి కరెంట్ లేదు.. చెంచుల నిరసన

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులు ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు ఓట్లు వేయకుండా బహిష్కరించారు. మూడు రోజుల నుంచి కరంట్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న మని నిరసన తెలిపారు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఫైర్ అయ్యారు.

చెంచులామని తమని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని  తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు.కరంట్  లాంటి సమస్యలు ఉన్న ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని కరంట్ లేకపోవడంతో పాము కాటుకు గురి కావాల్సివస్తుందని అన్నారు. చెంచుగూడెంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓట్లు బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. దీంతో విద్యుత్ అధికారులు హుటాహుటిన చెంచు గూడెంకు చేరుకున్నారు.