పని ఇస్తాం… రండి ప్లీజ్..!

పని ఇస్తాం… రండి ప్లీజ్..!

కూలీలను బతిమాలుతున్న కంపెనీలు

విమాన టికెట్లు కొనిచ్చే పరిస్థితి

న్యూఢిల్లీ: ఒకప్పుడు మెట్రో సిటీల్లో కూలీ పనులు దొరకడమే కష్టమయ్యేది. కరోనా పుణ్యమాని పరిస్థితులు తారుమారయ్యాయి. లాక్​డౌన్​, కరోనా కారణంగా లక్షల మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. కొందరైతే కాలినడకన బయల్దేరి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికీ కేసులు పెరుగుతూనే ఉండటంతో వెనక్కి రావడానికి ఇష్టపడటం లేదు. కొందరు రావడానికి రెడీ అవుతున్నా కుటుం బ సభ్యులు వారిస్తున్నారు. వలస కూలీలు లేకుంటే పనులు జరగవు కాబట్టి, వెనక్కి రప్పించడానికి కంపెనీలు తంటాలు పడుతున్నాయి.

కొన్ని కంపెనీలు విమాన టికెట్లు, మునుపటి కంటే ఎక్కు వ జీతం, ఉచిత రూమ్​ వంటివి ఆశ చూపుతున్నాయి. ఇండియా ఎకానమీకి వలస కూలీలు వెన్నెము క వంటివాళ్లు. ముంబై, హైదరాబాద్​ వంటి నగరాల్లో అయితే వీళ్లు భారీగా కనిపిస్తారు. అపార్టుమెం ట్లు, ఆఫీసులు, ఇండ్లలో సెక్యూరిటీ గార్డులుగా, వంట మనుషులుగా, క్లీనర్లుగా పనిచేస్తారు. ఇండియాలో కరోనా కేసుల్లో ముంబై మొదటి స్థానంలో ఉండటంతో నగరంలోని 80 శాతం మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. కన్​స్ట్ర క్షన్​ వర్కర్లు దొరక్క భవన నిర్మాణ పనులు ఆగిపోయాయని మహారాష్ట్ర చాంబర్​ ఆఫ్​ కామర్స్​ తెలియజేసింది. నాలుగు నెలల లాక్​డౌన్​ తరువాత ముంబైలో రిస్ట్రిక్షన్లను తగ్గించారు. దీంతో కంపెనీలు బతిమాలో సర్దిచెప్పో కొందరు వలస కూలీలను వెనక్కి రప్పించాయి. ఇప్పటికీ 10 వేల కన్​స్ట్ర క్షన్ల సైట్లు కూలీలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కూలీలను విమానాల్లో తీసుకొ స్తున్నామని, ఇన్సూరెన్స్​ సదుపాయం కూడా కల్పి స్తున్నామని రాజేశ్ ప్రజాపతి అనే డెవెలపర్​ వివరించారు. తిరిగి వచ్చిన వాళ్లందరికీ కరోనా టెస్టులు చేయించామని వెల్లడించారు. ఇప్పటికీ కూలీల కొరత బాగానే ఉందని వాపోయారు.

ఎన్ని ఆఫర్లిచ్చినా…

పెద్ద రియల్టీ కంపెనీల్లో ఒకటైన హీర్​ నందానీ గ్రూప్ లాక్​ డౌన్​ కాలంలోనూ వలస కూలీలకు జీతాలు ఇచ్చింది. అయినప్పటికీ మొత్తం 4,500 మంది కూలీల్లో 30 శాతం మందిని మాత్రమే వెనక్కి రప్పించింది. వలస కూలీలకు ఉచితంగా భోజనం పెడుతూ, శానిటైజేషన్​ సదుపాయాలు కల్పించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నామని కంపెనీ కోఫౌండర్​ నిరంజన్​ హీర్​నందానీ అన్నారు. చిన్నారుల కోసం క్రెష్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. వలస కూలీల కొరతతోపాటు డబ్బుపరమైన సమస్యలు, ఆగిపోయిన ప్రాజెక్టులు కంపెనీ బాసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్​తో ముంబై రియల్టీ మార్కెట్​ 90 శాతం పడిపోయింది. అమ్మకాలు విపరీతంగా తగ్గా యి. కంపెనీలకు అప్పులు దొరకడమూ కష్టం గా మారింది. ఒకవైపు అమ్మకాల తగ్గుదల, మరోవైపు వలస కూలీల కొరతతో సతమతమవుతున్నామని ముంబై కేంద్రం గా పనిచేసే కన్సల్టెన్సీ లైజెస్​ ఫోరాస్​ సీఈఓ పంకజ్​ కపూర్​ అన్నారు. బిల్డిం గులు కట్టడం ఆగిపోయింది కాబట్టి రియల్టర్లకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని చెప్పారు. ఇతర బిజినెస్​ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలియజేశారు. ప్రస్తుతం తమ సెక్టార్లో అయోమయం నెలకొందని గార్మెంట్​ ఎక్స్​పోర్టర్స్​ అసోసి యేషన్​ ఆఫ్​ రాజస్థా న్​ జనరల్​ సెక్రెటరీ అసీమ్​ కుమార్​ చెప్పారు.