ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నెహ్రు జూలాజికల్ జూ పార్క్-ఆరాంఘర్- మధ్య నిర్మించిన హైదరాబాద్‎లో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్‎ను 2025, జవనరి 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అనగానే అందరికి ముందుగా ఓల్డ్ సిటీ గుర్తుకు వస్తుందని.. ఆ తరువాతే సైబరాబాద్ ఇతర ప్రాంతాలు గుర్తుకు వస్తాయన్నారు. మేము నిర్మించిన ఫ్లై ఓవర్ రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నాడని కొందరు బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు.. కానీ మేము వచ్చిన తరువాతే సరైన సమయానికి నిధులు విడుదల చేసి ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేశామని కౌంటర్ ఇచ్చారు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి కాంగ్రెస్  ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. 

ALSO READ | కేటీఆర్ విల్లాలో ఏసీబీ సోదాలు