-
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నార. చెప్పారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, విజయరమణారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. "మెడికల్ కాలేజీల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు 25 శాతం సీట్లు ఇచ్చే అంశం పరిశీలిస్తున్నం" అని అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ..సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు చెప్పారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ..మాజీ మంత్రి హరీశ్ రావు మల్లన్నసాగర్ వద్దకు వెళ్లి వర్షం తామే కురిపించామన్నట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు.
