అల్లు అర్జున్​పై కక్ష సాధింపు మానుకోవాలి

  • రిపబ్లికన్ ​పార్టీ జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు

ఖైరతాబాద్, వెలుగు: అల్లు అర్జున్​పై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్​వద్ద జరిగిన ఘటనను ఒక యాక్సిడెంట్​గా భావించాలన్నారు. సినిమాకు హీరో ఒక్కడే ముఖ్యం కాదని, అన్ని 60 విభాగాలు కలిసి పనిచేస్తేనే సినిమా బయటకు వస్తుందన్నారు. చిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రేవతి మృతిచెందడం దురదృష్టకరమని, అందుకు అల్లు అర్జున్​ను బాధ్యుడిని చేస్తూ ఆయన ఇంటిపై దాడులు చేయడం మంచిది కాదన్నారు.