దివ్యాంగులకు చేయూతనివ్వాలి: సామల వేణు

సికింద్రాబాద్, వెలుగు: దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఇంటర్నేషనల్ మెజీషియన్, ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ సామల వేణు, ఇన్ కం ట్యాక్స్​కమిషనర్ బాలకృష్ణ అన్నారు. కార్ఖానా ఓల్డ్ వాసవినగర్ లోని మెంటల్లీ డీజేబుల్ ఆర్గనేషన్ లో దివ్యాంగుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్టును వారు ప్రారంభించారు. దాతలు ఇచ్చే విరాళాలు దివ్యాంగులకు, వారి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రాలిజిస్ట్ వక్కంతం చంద్రమౌళి, పమెం క్యాప్ ప్రెసిడెంట్ పి.గోపీనాథ్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.