పీవీ తెలంగాణలో పుట్టడం మన అదృష్టం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పీవీ నరసింహారావు 20వ వర్ధంతి (డిసెంబర్ 23) సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‎లోని పీవీ ఘాట్ వద్ద భట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పీవీ నరసింహారావు అనేక నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 

Also Read :- సీఎం రేవంత్ సార్.. మీరు కరెక్ట్

ఇక, పీపీ భూ సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. దేశంలో విద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు పీవీ అద్భుతమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడే విధంగా పీవీ కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలను పీవీ అమలు చేశారని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు పీవీ చూపించిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.