మూసీలో బోల్తా పడ్డ వాటర్ ట్యాంకర్

రంగారెడ్డి : రాజేంద్రనగర్ లో వాటర్ ట్యాంకర్ మూసీ నదిలో పడింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ నుంచి సన్ సిటీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి వాటర్ ట్యాంకర్ మూసీనదిలో పడిపోయి కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్,క్లీనర్ వాటర్ ట్యాంకర్ నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. భారీ క్రేన్ సహాయంతో వాటర్ ట్యాంకర్ ను బయటికి తీశారు సిబ్బంది.