భారత్ లో నీటి వనరులు.. కీలక అంశాలు

దేశంలోని భూ ఉపరితల నీటివనరుల లభ్యత గురించి చేపట్టిన అధ్యయనంలోని వివరాలను అసెస్​మెంట్​ ఆఫ్​ వాటర్ రిసోర్సెస్​ ఆఫ్​ ఇండియా 2024 పేరుతో సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) విడుదల చేసింది. భారతదేశ సగటు వార్షిక భూఉపరితల నీటివనరుల లభ్యత 1985 నుంచి 2023 వరకు, 2,115,95 బిలియన్ క్యూబిక్​ మీటర్లు (బీసీఎం)గా ఉన్నదని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. 

టాప్​ 3 బేసిన్​లు 

  • బ్రహ్మపుత్ర బేసిన్​ 592.32 బీసీఎం
  • గంగా బేసిన్​ 581.75 బీసీఎం
  • గోదావరి బేసిన్​ 129.17 బీసీఎం
  • దిగువ 3 బేసిన్​లు
  • సబర్మతి బేసిన్​ 9.87 బీసీఎం
  • పెన్నర్​ బేసిన్​ 10.42 బీసీఎం
  • మహి బేసిన్​ 13.03 బీసీఎం

2019లో దేశంలో భూఉపరితల నీటివనరుల లభ్యత 1,999.2 బీసీఎంగా ఉంటే, బ్రహ్మపుత్ర బేసిన్​లో భూటాన్​ సహకారం,  గంగా పరీవాహక ప్రాంతంలో నేపాల్​ సహకారం వల్ల ప్రస్తుతం భూఉపరితల నీటి వనరుల లభ్యత 2,115.95 బీసీఎంకి పెరిగింది. 
దేశంలో తలసరి భూఉపరితల నీటివనరుల లభ్యత 1700 క్యూబిక్​ మీటర్లు. అయితే, 2019 అధ్యయనం ప్రకారం, 2021లో తలసరి నీటిలభ్యత 1486 క్యూబిక్​ మీటర్లు ఉంటే, 2024 నాటికి తలసరి నీటి లభ్యత, 1513 క్యూబిక్​ మీటర్లుగా అంచనా వేశారు. తలసరి భూఉపరితల నీటివనరుల లభ్యతలో పెరుగుదల ఉన్నా భారతదేశం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. 

వినియోగించని భూఉపరితల నీటివనరులు

1999.2 బీసీఎం భూఉపరితల నీటివనరుల మొత్తంలో 690 బీసీఎం మాత్రమే వినియోగించడానికి వీలుగా ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. బ్రహ్మపుత్ర సబ్​ బేసిన్​ వంటి పెద్ద వాటితో పోలిస్తే చిన్న బేసిన్లలో వినియోగించదగిన నీటి నిష్పత్తి ఎక్కువగా ఉన్నదని సీడబ్ల్యూసీ పేర్కొన్నది. 

సెంట్రల్ వాటర్​ కమిషన్​

1945లో డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ సలహా మేరకు సెంట్రల్​ వాటర్ వేస్​, ఇరిగేషన్​ అండ్​ నావిగేషన్​ కమిషన్​(సీడబ్ల్యూఐఎన్​సీ)గా స్థాపించింది. జలశక్తి మంత్రిత్వశాఖ, జలవనరులశాఖ, నదుల అభివృద్ధి, గంగానది పునరుజ్జీవన మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేస్తుంది. ఇది నీటివనరుల అభివృద్ధి, నిర్వహణ కోసం పనిచేసే చట్టబద్ధమైన సలహా సంఘం. దీని చైర్మన్​ భారత్​ ప్రభుత్వానికి ఎక్స్​ అఫీషియో సెక్రటరీగా వ్యవహరిస్తారు. 

సీడబ్ల్యూసీ విధులు 

  •     నీటి వనరుల నియంత్రణ, పరిరక్షణ వినియోగం.
  •     నేషనల్​ రిజిస్టర్ ఆఫ్​ లార్జ్​ డ్యామ్​(ఎన్​ఆర్​ఎల్​డీ)ని నిర్వహించడం.
  •     హైడ్రోలాజికల్​ సర్వేలు నిర్వహించడం.
  •     భూఉపరితల నీటివనరులను సెంట్రల్​ వాటర్ కమిషన్​ నిర్వహిస్తే భూగర్భ జల వనరులను సెంట్రల్​ గ్రౌండ్​ వాటర్ బోర్డ్​(సీసీడబ్ల్యూబీ) నిర్వహిస్తుంది

ప్రధాన విభాగాలు 

  •     డిజైన్స్​ అండ్​ రీసెర్చ్​ విభాగం​.
  •     రివర్​ మేనేజ్​మెంట్​ విభాగం​.
  •     నీటి ప్రణాళికా ప్రాజెక్ట్స్​ విభాగం .