యాసంగికి శ్రీరాంసాగర్ నీటి విడుదల

బాల్కొండ,వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా మిడ్ మానేరు కు మంగళవారం నీటి విడుదల చేసినట్టు ఇరిగేషన్ డీఈ గణేశ్ తెలిపారు. యాసంగికి సాగు నీరందించేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు కాల్వ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు(80.50టీఎంసీలు). కాగా.. మంగళవారం సాయంత్రానికి  1089.80 అడుగులు(76.10టీఎంసీల)నీరు ఉంది.  

ప్రాజెక్టు నుంచి వివిధ కాల్వలకు  యాసంగి నీటి విడుదల చేస్తుండగా.. ఇందులో కాకతీయ కెనాల్ కు 5,500, లక్ష్మీ కెనాల్ కు 200,అలీసాగర్ ద్వారా 463 , గుత్ప లిఫ్టుఇరిగేషన్ కు 270 , సరస్వతీ కెనాల్ కు 700 , మిషన్ భగీరథ కు 231 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతుంది.  గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1086.60 అగుడులు,(65.13టీఎంసీల)నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు.