వనపర్తి పట్టణంలో వానాకాలం కూడా నీటి తిప్పలు

వనపర్తి, వెలుగు : వానాకాలంలోనూ వనపర్తి పట్టణంలో నీటి కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. నాలుగైదు రోజులుగా జనాలకు తాగునీరు సరఫరా కావడం లేదు. మున్సిపాలిటీ వారిని సంప్రదిస్తే పైప్​లైన్​ రిపేర్లు జరుగుతున్నాయని, రేపు, మాపంటున్నారని వాపోతున్నారు. 13వ వార్డుతో పాటు పలు వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగునీరు సప్లై కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 

వానాకాలంలోనూ ఏమిటీ బాధంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి మండలం అచ్యుతాపురం దగ్గర మిషన్  భగీరథ పైప్​లైన్​ పగిలిపోగా, సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి మంచినీటిని సప్లై చేసే రామన్ పాడు ప్రాజెక్టు, ఎర్రగట్టు పైప్​లైన్  దగ్గర సిబ్బంది రిపేర్లు  చేస్తున్నారు. సమస్య తీరేంత వరకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సప్లై చేయాలని ప్రజలు కోరుతున్నారు.