పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు

* వినియోగదారుల ఆందోళన

 ములుగు, వెలుగు : పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు అందోళనకు దిగిన సంఘటన ములుగు గ్రామంలో శ్రీ విద్యా సరస్వతి పెట్రోల్ బంక్ లో చోటుచేసుకుం ది. ములుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్ లో పెట్రోల్ పోసుకొని కొద్ది దూరం వెళ్లగానే బైకు ఆగిపోయింది. దాని వంచి చూసి, పెట్రోల్ బయటకు తీసేసరికి పెట్రోల్ కు బదులుగా నీక్ష రావడంతో

తిరిగి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి వారిని అడిగేసరికి వాళ్ళు ఏం సమాధానం ఇవ్వ లేదు. దీంతో వినియోగదారులు అందరు. కలిసి పెట్రోల్ బంక్ ముందు ఆందోళ నకు దిగారు. పెట్రోల్ బంక్ యజమాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాను.