మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు రిజర్వాయర్లు ఫుల్ .. జలకళ సంతరించుకున్న ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీ, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు

  • మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరులో 26.71 టీఎంసీల నీరు
  • మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు నుంచి ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీకి 3,136, మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 6,400 క్యూసెక్కుల నీరు
  • ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీ నిండడంతో కాకతీయ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటి విడుదల

కరీంనగర్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాలతో మానేరు పరిధిలోని రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఎస్సారెస్పీలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లా వరకు నీళ్లు అందించే కాకతీయ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆదెరువుగా మారిన మానేరు రిజర్వాయర్లు జలకళను సంతరించుకోవడంతో ఆయా జిల్లాల రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. 

మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి రంగనాయకసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీకి..

భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి, శ్రీరాం సాగర్ నుంచి వచ్చిన వరదతో మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిండుకుండలా మారింది. మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 27.54 టీఎంసీలు కాగా 26.71 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ నుంచి 14,500 క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తోంది. దీంతో సోమవారం ఒక గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎత్తి ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీకి 3,136 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ప్యాకేజీ 10 ద్వారా మరో 6,400 క్యూసెక్కుల నీటిని రంగనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వదులుతున్నారు. 

కాకతీయ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎల్ఎండీ నీరు

ఆగస్టు 24 నాటికి ఐదు టీఎంసీలతో డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజీలో ఉన్న లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 రోజుల్లోనే జలకళను సంతరించుకుంది. మొదట మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆగస్టు నెలాఖరు నాటికి ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీలో 13 టీఎంసీల నీరు చేరింది. మోయతుమ్మెద వాగు వరద కారణంగా మరో 7 టీఎంసీల నీరు ఎంఎండీలో చేరడంతో నీటి నిల్వ 20 టీఎంసీలకు చేరుకుంది. 

మోయతుమ్మెద వరద నీరు, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి నీటి విడుదలతో ఆదివారం వరకు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో సోమవారం ఉదయం ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు గంటల తర్వాత గేట్లను మూసివేసి కాకతీయ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్లను ఎత్తారు. దీంతో హుజురాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. 

రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు..

మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి నీటి విడుదలతో రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.55 టీఎంసీల నీరు చేరింది. దీంతో రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నారు. ఈ ఏడాది రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి సామర్థ్యమైన 3 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్టు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెప్పారు. ప్రస్తుతం రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటిని విడుదల చేస్తున్నారు. 

మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం 18.90 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 4 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ ఏడాది 21 టీఎంసీల నీటిని రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిల్వ చేయనున్నట్లు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు. గత నెల రోజుల్లో మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 5.80 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి సామర్థ్యం 15 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.1 టీఎంసీల నీరు నిల్వ ఉంది.