సోమశిలలో తేలిన వినాయక విగ్రహాలు

కృష్ణానదిలో నీటి ప్రవాహం తగ్గడంతో సోమశిల(బ్యాక్​ వాటర్)​ తీరంలో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు బయటపడ్డాయి. సోమశిలలోని కృష్ణానది బ్యాక్​వాటర్​ ఘాట్​లో ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. నిమజ్జన సమయంలో సోమశిలలో పుష్కలంగా నీరు ఉండటంతో సమీప గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి తెచ్చిన వినాయకుడి విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్​లో నీటి మట్టం తగ్గడంతో సోమశిల పుష్కర ఘాట్ల వద్ద నీరు తగ్గింది. దీంతో  కృష్ణానది తీరంలో వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. విగ్రహాలను దూరంగా తరలించి పుష్కర ఘాట్లను శుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు. సోమశిల(నాగర్​కర్నూల్), వెలుగు