అక్రమ కనెక్షన్లు ఉంటే ఇక క్రిమినల్​కేసులు

  • ఇల్లీగల్​కనెక్షన్లపై వాటర్​బోర్డు సీరియస్​యాక్షన్


హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో అక్రమ కనెక్షన్లపై వాటర్​బోర్డు కొరఢా ఝులిపించనున్నది. ఇల్లీగల్​నల్లా, సీవరేజీ కనెక్షన్లుంటే క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని భావిస్తున్నది. హోటల్స్, హాస్పిటల్స్, బేకరీలు, మాల్స్​లో సగానికి సగం రూల్స్​పాటించడం లేదని, నల్లా, సీవరేజీ కనెక్షన్ల విషయంలో కమర్షియల్​యాక్టివిటీస్​చేస్తూ డొమెస్టిక్​కనెక్షన్ల ఫీజులు కడుతున్నారని గుర్తించారు.

వీరు అప్​గ్రేడ్​చేసుకోకపోతే అక్రమ కనెక్షన్లుగా పరిగణించి క్రిమినల్​కేసులు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల మెహదీపట్నంలోని కింగ్స్​హోటల్​లో తనిఖీలు చేయగా అక్రమ సీవరేజీ కనెక్షన్​ఉన్నట్టు గుర్తించి కట్​చేశారు. క్రిమినల్​కేసు పెట్టాలని భావించగా, భారీ జరిమాన కట్టడంతో వదిలిపెట్టారు. ఇలా సిటీలో చాలామంది కమర్షియల్​యాక్టివిటీస్​చేస్తూ అక్రమ సీవరేజీ కనెక్షన్లు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఇక అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు అక్రమ నల్లా, సీవరేజీ కనెక్షన్లను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

క్రిమినల్​ కేసులు పెట్టాలని నిర్ణయం

గ్రేటర్​ పరిధిలో13.80 లక్షల వాటర్​ కనెక్షన్లున్నాయి. వీటిలో రికార్డుల ప్రకారం 50 నుంచి 60 వేల కమర్షియల్​కనెక్షన్లున్నాయి. వాస్తవానికి మరో 50 వేల వరకు ఇల్లీగల్​కమర్షియల్​కనెక్షన్లు ఉంటాయని భావిస్తున్నారు. హాస్పిటల్స్​, మాల్స్​, బేకరీలు, హోటల్స్​, ఫంక్షన్​హాల్స్​, క్లబ్బులు తప్పని సరిగా కమర్షియల్​ కనెక్షన్లు కలిగి ఉండాలి. సీవరేజీ కనెక్షన్లు కూడా కమర్షియల్​ కేటగిరీలోనే ఉండాలి.

కానీ చాలా వరకు డొమెస్టిక్​ కేటగిరీలోనే ఉన్నాయి. దీని వల్ల సీవరేజీ లైన్లపై ఒత్తిడి పెరిగి ఓవర్​ఫ్లో అవుతోంది. అంతే కాకుండా రికార్డుల్లో డొమెస్టిక్​సైజు ఉండి, వాస్తవంగా కమర్షియల్​కనెక్షన్​ఉన్నవి కూడా లక్షకు పైగానే ఉండే అవకాశం ఉందంటున్నారు. రికార్డుల్లో ఒక కనెక్షన్​ ఉండి రెండు కనెక్షన్​లను కలిగి ఉన్న వారు కూడా నగరంలో అధికంగానే ఉన్నారు. గ్రేటర్​పరిధిలో దాదాపు ఐదు లక్షల బిల్డింగులు, ప్రాంగణాల్లో సీవరేజీ లైన్లు కమర్షియల్​కేటగిరీలో ఉండాల్సి ఉండగా, రెండున్నర లక్షలు కూడా లేవని ఆఫీసర్లు చెప్తున్నారు. తనిఖీల్లో ఇలాంటివి గుర్తిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు క్రిమినల్​కేసులు పెడతామంటున్నారు. 

వచ్చే వేసవి నాటికి పూర్తి

 సీవరేజీ కనెక్షన్ల విషయానికి వస్తే కమర్షియల్​కార్యకలాపాలు నిర్వహించే హోటళ్లు, హాస్పిటల్స్​, బేకరీలు, ఫంక్షన్​హాల్స్​, మాల్స్​ వంటి వాటిలో తప్పని సరిగా సీవరేజీ లైన్​కనీసం 6 ఇంచులు, 8 ఇంచుల పైప్​లైన్​తో ఉండాలి. కానీ వీటిలో కూడా చాలా వరకు 4 ఇంచుల పైప్​లైన్​లే ఉంటున్నాయి. అలాగే వారు సెపరేట్​గా మ్యాన్​హోల్స్​,సిల్ట్​ఛాంబర్లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ, అధికశాతం వినియోగదారులు నేరుగా వాటర్​బోర్డుకు చెందిన సీవరేజీ లైన్లకు కనెక్షన్​ఇచ్చేస్తున్నారు. ఆ కనెక్షన్ల నుంచి వచ్చే భారీ వ్యర్థాలన్నీ వాటర్​బోర్డు మ్యాన్​హోల్స్​లో చేరి ఓవర్​ఫ్లో అవుతున్నాయి. వచ్చే వేసవి నాటికి నగరంలో అక్రమ నల్లా కనెక్షన్లు, సీవరేజీ కనెక్షన్లను క్రమబద్ధీకరించి బోర్డు ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని అధికారులు టార్గెట్​గా పెట్టుకున్నారు.