కలుషిత నీటి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి : ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్​బోర్డు ఎండీ అశోక్‌‌ రెడ్డి ఈడీ మ‌‌యాంక్ మిట్టల్‌‌తో క‌‌లిసి శుక్రవారం ఓఅండ్ఎం అధికారులతో ఎంసీసీ(మెట్రో కస్టమర్ కేర్) ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, కలుషిత నీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే తిరిగి నిర్మించాలని, కవర్లు కనిపించని స్థితిలో ఉంటే కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 90 రోజుల డీసిల్టింగ్ ప‌‌నుల పురోగ‌‌తిని అడిగి తెలుసుకున్నారు. 

లక్షా 65 వేల మ్యాన్​హోల్స్​లో పూడిక తీశామని చెప్పారు. వాటర్​ట్యాంక‌‌ర్ల బుకింగ్‌‌, స‌‌ర‌‌ఫ‌‌రా తీరుపై ఈడీ మ‌‌యాంక్ మిట్టల్ స‌‌మీక్షించారు. రెసిడెన్షియ‌‌ల్ అవ‌‌స‌‌రాల‌‌కు మొద‌‌టి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.