మైలార్దేవ్పల్లిలో దారుణం.. కంపెనీలో చోరీని అడ్డుకున్న వాచ్ మెన్ హత్య..

ఓ కంపెనీలో దొంగతనానికి వచ్చిన దుండగుడు.. వాచ్ మెన్ ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ చోటుచేసుకుంది. కంపెనీలో చోరీకి యత్నించిన దుండగుడిని వాచ్ మెన్ అడ్డుకున్నాడు. దీంతో వాచ్ మెన్ పై దుండగుడు ఇనుప రాడ్ తో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.

తర్వాత ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆరు సీసీ పుటేజ్ కెమెరాలను దుండగుడు ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.  అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.