మెదక్​ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీల పొగ, దుర్వాసనతో అవస్థలు

శివ్వంపేట, వెలుగు : మెదక్​ జిల్లా మనోహరాబాద్, గుమ్మడిదల మండలాల్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ పదార్థాలను డీసీఎం, లారీల్లో తీసుకొచ్చి శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామ శివారులో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో పారబోసి తగలబెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున పొగ వెలువడుతుండడంతో పాటు, దుర్వాసనతో సమీపంలో పొలాలు ఉన్న రైతులతోపాటు, ఆలయానికి వచ్చే భక్తులు అవస్థ పడుతున్నారు. ఆలయ సిబ్బంది, భక్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -