IND Vs NZ, 1st Test: కుప్పకూలిన టీమిండియా.. వసీం జాఫర్ సెటైరికల్ వీడియో

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ టీమిండియాకు పీడకలగా మారింది. స్టార్ ఆటగాళ్ళున్న మన జట్టు పెద్దగా అనుభవం లేని న్యూజిలాండ్ చేతిలో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. 20 పరుగులు చేసి రిషబ్ పంత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైశ్వాల్ 13 పరుగులు మాత్రమే చేశాడు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, జడేజా డకౌటయ్యారు. ఇంత ఘోరంగా బ్యాటింగ్ చేయడంతో భారత మాజీ బ్యాటర్ టీమిండియాపై  సెటైరికల్ వీడియో ఒకటి తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు.  

ఈ ట్వీట్ లో ఒక టెంట్లో ఉన్న పిల్లలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ జారి పడుతుంటారు. ఇందులో ఉన్న నీతి ఏంటంటే.. ముందు వెళ్లిన పిల్లాడు అవరోధాన్ని గమనించకుండా కింద పడతాడు. అది చూసిన ఇతర పిల్లలు జాగ్రత్త పడకుండా వాళ్లు అదే తప్పిదం చేసి బోర్లా పడ్డారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్ల ప్రదర్శన కూడా అచ్చం అలానే సాగింది. వచ్చినవారు వచ్చినట్టు పెవిలియన్ కు క్యూ కట్టారు. కనీసం ఒక్కరు కూడా భారత్ ను ఆదుకోవడంలో విఫలమయ్యారు. 

ALSO READ | IND Vs NZ, 1st Test: సొంతగడ్డపై 46 పరుగులకే ఆలౌట్.. ఒక్క మ్యాచ్‌లో ఇన్ని చెత్త రికార్డులా

ఈ టెస్ట్ విషయానికి వస్తే  రెండో రోజు టీ విరామానికి ముందు న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. క్రీజ్ లో కాన్వే (57) యంగ్ ఉన్నారు. 19 పరుగులు చేసిన కెప్టెన్ లాతమ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం కివీస్ 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉండడంతో భారీ ఆధిక్యం సంపాదించడం ఖాయంగా కనిపిస్తుంది. అంతకముందు న్యూజిలాండ్ పేసర్లు  విలియం ఒరోర్కే, హెన్రీ విజృంభించడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌటైంది.