IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి

పెర్త్ టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ ఊహించని బంతితో ఆశ్చర్యపరిచాడు. ఏకంగా 140 కి.మీ వేగంతో బంతిని వేసి షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 40 ఓవర్ నాలుగో బంతిని మిచెల్ మార్ష్ కు సుందర్ ఈ బంతిని విసిరాడు. సుందర్ స్పిన్నర్ ఒక్కసారిగా ఇంత వేగంతో బంతి వేయడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక స్పిన్నర్ వేగం 100  కి.మీ కంటే ఎక్కువగా ఉండదు. కానీ 140  కి.మీ వేగం అంటే షాక్ అవ్వాల్సిన విషయమే. 

ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో సుందర్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుండడంతో స్పిన్నర్లు వికెట్లు తీయడంలో శ్రమించాల్సి వస్తుంది. బ్యాటింగ్ లో మాత్రం రెండో ఇన్నింగ్స్ లో 29 పరుగులు చేసి రాణించాడు. అశ్విన్, జడేజాను కాదని ఈ మ్యాచ్ తుది జట్టులో సుందర్ కు చోటివ్వడం గమనార్హం. 

Also Read :- అయ్యో ఇలా చిక్కేశావేంటి: లియాన్ ప్లానింగ్‌కు పంత్ బోల్తా

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజ్ లో క్యారీ (2), స్తర్క్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా గెలవాలంటే మరో 352 పరుగులు చేయాలి. మరో వైపు భారత్ విజయానికి 3 వికెట్లు చాలు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది.  రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.