మెల్‌బోర్న్: టెస్టు అరంగేట్రం చేసేటప్పుడు ఈ ఫార్మాట్‌లో తన సత్తాను ప్రశ్నించిన విమర్శకుల అభిప్రాయాలను తప్పని నిరూపించాలనుకున్నానని టీమిండియా నయా సెన్సేషన్ ప్లేయర్ నితీశ్ రెడ్డి తెలిపాడు. ‘ఐపీఎల్‌లో ఆడిన యవ ప్లేయర్ అంత పెద్ద ఆసీస్‌తో సిరీస్‌లో రాణించలేడని చాలా మంది నన్ను అనుమానించారు. నా గురించి వాళ్లు చెప్పింది తప్పు అని నిరూపించాలని డిసైడ్ అయ్యా. ఇప్పుడు అదే పని చేస్తున్నా. టీమిండియా కోసం వంద శాతం కష్టపడేందుకు నేను ఇక్కడ ఉన్నానని ప్రజలకు తెలిస్తే చాలు. ఐపీఎల్ తర్వాత నా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించా. నా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టా. ఇప్పుడు అది మంచి ఫలితాలను అందిస్తోంది. ఇదంతా ఒకటి, రెండు నెలలో వచ్చింది కాదు. మూడేండ్లుగానా బ్యాటింగ్, బౌలింగ్‌పై చాలా శ్రమించా’ అని నితీశ్ చెప్పాడు.