- ఆర్ఎంపీల ట్రీట్మెంట్ తోనే ప్రాణాల మీదికి వచ్చింది
- రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్వర్
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల స్టూడెంట్ చౌదరి శైలజ ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదని, ఆమెకు ఆర్ఎంపీలు అందించిన ట్రీట్మెంట్ తోనే ప్రాణాల మీదకు వచ్చిందని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం వాంకిడి పాఠశాలను విజిట్ చేసి, విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు.
అనంతరం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ స్టూడెంట్ చనిపోవడానికి ఫుడ్ పాయిజన్ కారణం కాదన్నారు. మిగిలిన స్టూడెంట్స్ కోలుకుని, ఒక స్టూడెంట్ మాత్రమే చనిపోవడంపై వివరాలు సేకరించామన్నారు. ఇప్పటివరకు ఫుడ్ పాయిజన్ రిపోర్ట్ రాలేదని చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కమిషన్ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.