సమీర్ వాఖండేపై బదిలీ వేటు

సమీర్ వాఖండేపై బదిలీ వేటు

డ్రగ్స్  ఆన్ క్రూయిజ్ కేసులో దర్యాప్తు సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి సమీర్ వాంఖడేపై బదిలీ వేడు పడింది. ఈ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్ సీబీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో సమీర్ వాంఖడేపై బదిలీ వేయాలనే డిమాండ్స్ వినిపించాయి. ఈ క్రమంలో.. ఆయనను చెన్నైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో టాక్స్‌పేయర్ సర్వీస్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తున్నట్లు ఎన్ సీబీ (NCB) తెలిపింది. అంతకుముందు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై కార్యాలయంలో జోనల్ డైరెక్టర్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. 
గత అక్టోబర్ నెలలో కార్డెలియా క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ సేవిస్తున్నారనే సంగతి ఎన్సీబీకి సమాచారం వచ్చింది.
 

దీంతో సమీర్ వాంఖడే ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ షిప్ లో షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో సహా మరో 22 మందిని అరెస్టు చేశారు. వీరిని జైలుకు తరలించారు. అనంతరం వాంఖడేపై అవినీతి ఆరోపణలు, కేసు దర్యాప్తులో లోపాలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. డ్రగ్స్ కేసు ముంబై జోన్ నుంచి ఎన్సీబీ కేంద్ర బృందానికి బదిలీ చేసింది. అంతేగాకుండా ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తు నుంచి కూడా తొలగించింది. వాంఖడేపై విజిలెన్స్ విచారణ సైతం జరిగింది. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ పై వచ్చిన ఆరోపణలపై క్లీన్ ఇచ్చిన కొద్ది రోజులకే సమీర్ పై బదిలీ వేటు పడడం గమనార్హం.

మరిన్ని వార్తల కోసం  :-

ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్


సివిల్స్​లో మహిళల హవా