ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీ వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొంతమంది కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా  రాజాసింగ్ మాట్లాడారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నామని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసుల్లో రాజాసింగ్ పై ఇప్పటికే పలుమార్లు కేసులు నమోదయ్యాయి. అలాగే..  చంపేస్తామంటూ రాజాసింగ్ సింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తుంటాయి.