Good News : దుబాయ్లో ఉద్యోగాల కోసం.. హైదరాబాద్లో ఇంటర్వ్యూలు ఇక్కడే

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జాబ్ చేయాలనుకుంటున్నారా?  అయితే ఇది మీకు చక్కని అవకాశం. ఈ ఉద్యోగాల కోసం లేబర్, ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (TOMCOM) హైదరాబాద్ లో ఇంటర్వూకి ఆహ్వానిస్తోంది. దుబాయ్ లో డెలివరీ ఏజెంట్ (బైక్ రైడర్స్) జాబుల కోసం ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్ విజయనగర కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ (ITI) క్యాంపస్ లో డిసెంబర్ 20 (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. 

  • అర్హతలు:

10వ తరగతి పాసై ఉండాలి
టూ వీలర్ డ్రైవింగ్ లో 3 ఏళ్ల అనుభవం ఉండాలి
పాస్ పోర్టు ఉండాలి 
వయసు 21 -----నుండి 38 మధ్యలో ఉండాలి. 

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: 

TOMCOM.. 9440050951/9440049861/9440051452.