తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు.. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం..

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని  జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో  జె.శ్యామల రావు తెలిపారు.  ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు, అన్ని రకాల దర్శనాలు రద్దు చేశారు. 9 వ తేది ఉదయం 5 గంటలకు  టీటీడీ టోకెన్స్ జారీ  చేయనుంది . రాంభగీచాలో  రెండు అలైటింగ్ పాయింట్స్, ఏటీసీ వద్ద మూడు పాయింట్స్ను ఏర్పాటు చేశారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలను విద్యుత్, పుష్పాలంకరణతో  సుందరంగా ముస్తాబు చేస్తామని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 వ తేదీన ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం పై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అభయమిస్తారు.  ఆ తరువాత 12 నుంచి 4 గంటల వరకు వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామి దర్శనం ఇస్తారు.   9 వ తేది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి 1 లక్ష 20 వేల టికెట్స్ జారీ చేస్తారు.  ఇక 11 వ తేది ఉదయం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం  కార్యక్రమం ఉంటుంది.ఉత్తర ద్వార దర్శనానికి 94 కౌంటర్ల ద్వారా  టైం స్లాట్ టోకెన్స్ జారీ  చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.  ఇచ్చిన సమయానికి క్యూలైన్ వద్దకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ తెలిపింది.  టోకెన్స్, టికెట్స్ ఉన్న భక్తులకే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది.  టోకెన్స్ లేని భక్తులకు దర్శనం ఉండదు…. తిరుమలకు అనుమతిస్తారు. 

Also Read : ఆ దేవాలయం విశిష్టత ఏంటీ.. ఎవరు కట్టారు.. ?

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ స్థాయిలో పార్కింగ్​ సౌకర్యం ఏర్పాటు చేశారు. పార్కింగ్​ టిక్కెట్లపైనే  ఎంట్రీ పాయింట్, పార్కింగ్ పాయింట్స్ ..  వివరాలు నమోదు చేస్తామని టీటీడీ తెలిపింది.  భక్తులు ఇబ్బంది పడకుండా 3 వేల మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో  గట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఏంపీవీ వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని .. మార్గదర్శకాలు వస్తే అమలు చేస్తామని టీటీడీ ఈవో -శ్యామల రావు తెలిపారు. 

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్​ రాజ్​ లో  జరిగే మహా కుంభమేళాలో టీటీడీ పాల్గొంటుంది.  హిందూ ధర్మప్రచార పరిషత్​  లో భాగంగా తిరుమల  నమూనా ఆలయం ఏర్పాటు  చేస్తున్నారు.  దీని కోసం 2.5 ఎకరాల భూమిని టీటీడీ కి  కుంభమేళానిర్వాహకులు కేటాయించారు. అక్కడ  తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.  ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తామన్నారు.  కుంభమేళాలో నాలుగు  సార్లు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.