ముంబై : వచ్చే నెల నాలుగు టీ20ల సిరీస్ కోసం సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే ఇండియా టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్‌లోనే రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టెస్టు జట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్ –గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇదే జట్టుతో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ వీవీఎస్ మరోసారి జట్టు కోచింగ్ బాధ్యతలు చేపడుతాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఇండియా నవంబర్ 8, 10, 13,15వ తేదీల్లో వరుసగా డర్బన్, గెబెరా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ వేదికల్లో సౌతాఫ్రికాతో నాలుగు టీ20లను ఆడనుంది. ఎన్‌సీఏ కోచ్‌లు బహుతులే, హృషికేష్, శుభదీప్ వీవీఎస్ ఆధ్వర్యంలోని కోచింగ్ సిబ్బందిలో భాగం కానున్నారు.