ఇవ్వాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్

  • ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు
  • పార్టీ గుర్తు ఉండదు.. బ్యాలెట్​పై అభ్యర్థి పేరు, ఫొటో
  • 52 మంది అభ్యర్థులు.. జంబో బ్యాలెట్ పేపర్​
  • ప్రయార్టీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికీ ఓటు వేయొచ్చు
  • ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: వరంగల్–-ఖమ్మం–-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 12 జిల్లాల పరిధిలో మొత్తంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

ఇందులో పురుషులు 2,88,189 మంది, మహిళలు 1,75,645 మంది, ఇతర ఓటర్లు ఐదుగురు ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3 వేల మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి మొత్తంగా 52 మంది బరిలో ఉన్నారు.

జంబో బ్యాలెట్ పేపర్​

ఇతర ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలకు పార్టీ గుర్తు ఉండదు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు, అభ్యర్థి ఫొటో మాత్రమే ఉంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటా ఉండదు. అభ్యర్థి పక్కనే ఉన్న బాక్స్​లో ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలి. 52 మంది క్యాండిడేట్లు పోటీలో ఉండటంతో జంబో బ్యాలెట్​ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

 2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20 వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి.. అభ్యర్థుల గెలుపు, ఓటములు నిర్దేశించడంలో చెల్లని ఓట్లు కీలకంగా మారనున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకపోయినా.. రెండో ప్రాధాన్యత ఓట్లు గెలుపోటములను నిర్ధేశిస్తాయి. మొత్తం పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఓటింగ్ ఇట్ల వేయాలి

  •     అభ్యర్థి పేరు, ఫొటో పక్కన ఉన్న బాక్స్​లో ఇంగ్లిష్ నంబర్ మాత్రమే నమోదు చేయాలి. అంటే అభ్యర్థి పేరు పక్కన 1, 2, 3, 4, 5.. అంటూ నంబర్లు మాత్రమే వేయాలి. ఒకటి అని తెలుగులో లేదా వన్ అని ఇంగ్లిషులో రాయకూడదు.
  •     పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులు అందించిన పెన్నుతో మాత్రమే బ్యాలెట్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలి. సొంత పెన్ను లేదా ఇతర రంగులు వాడినా ఓటు చెల్లదు.
  •     ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలనుకున్న క్యాండిడేట్ పేరుకు ఎదురుగాఉన్న బాక్సులో 1 నెంబర్ వేయాలి ఆ తరువాతే మీ చాయిస్​ను ప్రకారం 2,3,4,5 అంటూ ప్రయారిటీ ఓట్లను ఇతర క్యాండిడేట్ల పేర్ల పక్కనున్న బాక్స్​లో వేయాలి.
  •     ఇంటర్నేషనల్, ఇండియన్, రోమన్ లేదా రాజ్యాంగం గుర్తించిన ఏ ఇతర భాషల నంబర్లను అయినా బాక్స్​లో వేయొచ్చు. కానీ కౌంటింగ్​కు ఇబ్బంది లేకుండా అందరూ 1,2,3 అంకెలనే వేయాలని అధికారులు సూచిస్తున్నారు. 
  •     ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి. ఇతర క్యాండిడేట్లకు ప్రాధాన్యత ఓటు వేయకున్నా ఏం కాదు. ఒకటి, రెండు ప్రయారిటీలు ఇచ్చి మూడోది ఇవ్వకున్నా పర్వాలేదు. ఎన్ని ప్రయారిటీ ఓట్లు వేసినా నంబరింగ్ మాత్రం వరుసగా ఉండాలి. 1, 2 ప్రయారిటీలు ఇచ్చి మూడోది ఇవ్వకుండా 4 ప్రయారిటీ ఇస్తే.. రెండో ప్రయారిటీ ఓటు వరకే కౌంట్ అవుతుంది. 
  •     ఫస్ట్​ ప్రయారిటీ (1) ఓటు వేయకుంటే ఆ ఓటును రిజెక్ట్ చేస్తారు. అంటే 1 అంకె వేయకుండా .. 2,3,4 వేస్తే ఆ ఓటు చెల్లదు.
  •     ఎలాంటి నంబరు లేకుండా ఇచ్చిన బ్యాలెట్ పేపర్ కూడా చెల్లదు.  ఒకే వ్యక్తికి రెండు ఓట్లు చెల్లవు. ఒకే నంబర్ ఇద్దరికి ఇచ్చినా చెల్లదు.
  •     బ్యాలెట్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టిక్ మార్క్ ఉంటే, రౌండప్, సంతకం, వేలి ముద్ర, పేర్లు, గీతలు, చుక్కలు, రాయొద్దు. ఏదైనా ఇతర గుర్తులు వేసినా చెల్లని ఓటుగా పరిగణించబడతాయి.
  •     ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా అందరికీ ఓటేయాల్సిన అవసరం లేదు. ప్రాధాన్యతా క్రమంలో నచ్చిన కొందరికి ఓటు వేస్తే సరిపోతుంది. అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత ఎలాంటి దిద్దుబాట్లు లేదా తొలగింపులు చేయకూడదు.