తెలంగాణలో ఓటర్లు 3 కోట్ల 35 లక్షలు..మహిళలే అధికం

  • అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7.65 లక్షల మంది
  • అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితాను సీఈఓ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 3, 35, 27, 925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళలు కాగా 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 

మొత్తం ఓటర్లలో 5,45,026 మంది 18–19 ఏండ్ల మధ్య వయసున్న ఓటర్లు. 2,22,091 మంది 85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు ఉన్నారు. 5,26,993 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,65,982 మంది, అతి తక్కువగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.

సవరించిన ఓటర్ల జాబితా వివరాలు 

  • మొత్తం ఓటర్లు    3,35,27,925
  • పురుష ఓటర్లు    1,66,41,489
  • మహిళా ఓటర్లు    1,68,67,735
  • థర్డ్ జెండర్ ఓటర్లు    2,829
  • 18-19 ఏండ్ల ఓటర్లు    5,45,026
  • 85 ఏళ్లు దాటిన ఓటర్లు    2,22,091
  • ఎన్ఆర్ఐ ఓటర్లు    3,591
  • దివ్యాంగ ఓటర్లు    5,26,993