ఎన్నికల విధులు ఎవరు నిర్వహించాలో ఈసీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈ సారి ఎన్నికల విధులు నిర్వహించకూడదని ఈసీ తెలిపింది. అలాగే వాలంటీర్లను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. కేవలం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈసీ ప్రకటించింది.
2024 ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ విడుదల చేసింది. బహిరంగసభలు.. ఎన్నికల ర్యాలీల విషయంలో రాజకీయ పార్టీలు నిబంధనలను పాటించాలని తెలియజేయాలని సూచించింది. ముందుగానే అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈసీ తెలిపింది. నియమాలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఎన్నికల విధులు నిర్వహించే వారు ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దొంగ ఓట్లు వేసిన వారిని ఆర్పీ యాక్ట్ 1951 .. సెకక్షన్ 61 ప్రకారం శిక్షిస్తామని ఈసీ తెలిపింది. పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లా పోలింగ్ అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి .. ఆదేశాలు జారీ చేస్తారని ఈసీ ప్రకటించింది. ప్రతి పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజంట్లు సంయమనం పాటిస్తూ.. ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని సూచించారు.