వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత...భారీగా పోలీస్ బలగాల మోహరింపు..

వైజాగ్ స్టీల్త్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఈడీ ఆఫీసు ముట్టడించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో భారీగా పొలిసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మంగళవారం ( అక్టోబర్ 1, 2024 ) ఉదయం పొలిసు ఉన్నతాధికారులు సైతం స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. ఈడీ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు కార్మికులు. అధికారులను బయటకు రాకుండా అడ్డుకొని.. కాంట్రాక్టు ఉన్నంత వరకు తమను కొనసాగించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు.

ALSO READ | ఉన్న సమాచారాన్ని మాత్రమే సీఎం చంద్రబాబు చెప్పారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాగా.. 4వేల 200మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేపడితే.. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్ట్రాటజిక్ సేల్ పేరిట స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడుతున్నారు ఉద్యోగులు.