స్టైరీన్ లీక్: విషాదపట్నం గా మారిన విశాఖ

స్టైరీన్ లీక్: విషాదపట్నం గా మారిన విశాఖ

ఏపీలోని విశాఖపట్నం.. విషాదపట్నంగా మారింది. గురువారం తెల్లవారుజామున అక్కడ గాలి విషమైంది. గాఢ నిద్రలో ఉన్న జనం ఆ విషవాయువు ప్రభావం తో స్పృహతప్పి పడిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వందల్లో జనం ఎక్కడివారక్కడ కుప్పకూలిపోయారు. 11 మంది మృత్యువాతపడ్డా రు. తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. క్షణాల్లోనే ఆ పొగలు 5 నుంచి 7 కిలోమీటర్ల వరకు వ్యాపించాయి.  లాక్ డౌన్ వల్ల మూతబడ్డ ఆ ఫ్యాక్టరీ రెండురోజుల క్రితమే తెరిచారు. గురువారం తెల్లవారుజామున  ఫ్యాక్టరీ నుంచి స్టెరీన్ లీకైంది.  మొదట మంటలు, తర్వాత పొగలు వెలువడ్డాయి. గ్యాస్ ఎఫెక్ట్ తో   ఆర్ఆర్ వెంకటాపురం, గోపాలపట్నం చిగురుటాకుల్లా వణి కిపోయాయి. వెయ్యి మందికిపైగా తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సైరన్లు మోగించి జనాన్ని అలర్ట్చేశారు. అప్పటికే స్పృహ తప్పికొట్టుమిట్టాడుతున్నకొందరిని తలుపులు బద్దలు కొట్టిఇండ్లనుంచి బయటకు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం ఇండ్లనుంచి పరుగులు తీశారు. అలా పరుగులు తీస్తూనే పిల్లలు, మహిళలు, వృద్ధులు విషవాయువు వల్ల ఊపిరాడక ఎక్కడివా రక్కడ రోడ్లమీదే కుప్పకూలిపోయారు. సహాయ చర్యలకు వచ్చిన కొందరు పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది కూడా స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో మళ్లీ గ్యాస్ లీ కవుతున్నట్లు వార్తలు వెలువడటంతో జనం మరింత ఆందోళనకు గురయ్యారు. అయితే.. అలాంటిదేం లేదని ఏపీ పోలీసు శాఖ ప్రకటించింది. స్టైరీన్‌ ‌గ్యాస్‌‌ సుమారు 3వేల మందిపై ప్రభావం చూపింది. కొట్టాల్లో కట్టేసిన బర్లు, ఎద్దులు గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి. రోడ్ల మీద కుక్కలు, పిల్లులు, పక్షులు, కోళ్లు , పాములు, బల్లులు, చిన్న చిన్న కప్పలు నిర్జీవంగా పడిపోయాయి. పచ్చని చెట్లు రంగుమారాయి. తెల్లవా రుజాము నుంచీ మధ్యాహ్నం వరకు విశాఖలో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. బాధితులతో నిండిపోయిన కింగ్ జార్జి హాస్పిటల్ సుమారు 7 కిలోమీటర్ల వరకు  గ్యాస్ విస్తరించడంతో ఆయా గ్రామాల్లోని వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానిక కింగ్‌జార్జి హాస్పిటల్ తో పాటు ఇతర హాస్పిటల్ కు  తరలించారు. జనం ఎక్కువవడంతో ఒక్కో బెడ్ మీద  ఇద్దరు ముగ్గురికి ట్రీట్ మెంట్ చేయాల్సి వచ్చింది. అందరూ తప్పనిసరిగా తడి మాస్కులు ధరించాలని, అరటిపండ్లను తినాలని, నీళ్లను , పాలను తాగాలని, బెల్లం తినాలని వైద్యా శాఖ అధికారులు సూచనలు చేశారు. గురువారం తెల్లవారు జాము డయల్100 ద్వారా పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని విశాఖ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్ర్భాం తి వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ, నేషనల్ డిజాస్ట ర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏపీ సీఎంజగన్ కు ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. అందరూ కోలుకోవాలని ప్రార్థిస్తు న్నట్లుప్రధాని ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్    ఉపరాష్ట్రపతి వెంకయ్యనా యుడు, కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్‌‌‌‌రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, జన సేన చీఫ్ పవన్ కల్యాణ్ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భోపాల్ విషాదం నాటి దృశ్యాలు 1984 డిసెంబర్ లో   జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటన దృశ్యాలు గురువారం విశాఖ వీధుల్లో కనిపించాయి. భోపాల్లో గ్యాస్ లీకవడంతో 3,000 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది ఇప్పటికీ ఆ ప్రభావంతో జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు.

మెయింటెనెన్స్  చేయకనే ప్రమాదం

విశాఖ సిటీకి సంఘటన స్థ లం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1961లో ఏర్పాటు చేసిన ఎల్జీ పాలి మర్స్ ఫ్యాకరీని 1997 నుంచి సౌత్ కొరియా సంస్థ నడిపిస్తోంది. గ్యాస్‌‌‌‌లీకవడానికి ఫ్యాకరీ మేనేజ్ మెంట్  నిరక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లోనూ పరిశ్రమలో రోజూ మెయింటెనె న్స్‌‌‌‌చేయాల్సి ఉన్నా మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు బాధితులు చెబుతున్నారు. 45 మందికి మెయింటెనెన్స్‌ ‌‌‌పాస్‌‌‌‌లు ఇచ్చినా చర్యలు తీసుకోలేనట్లు సమాచారం. ట్యాంకుల్లో దాదాపు 2 వేల టన్నుల స్టెరీన్ గ్యాస్ ను నిల్వచేశారు. ఈ కార్బన్ కెమికల్ను ప్లాస్టిక్ తయారీకి వాడుతుంటారు. ట్యాంకుల వద్ద 20 డిగ్రీల లోపు టెంపరేచర్ ఉంచాల్సి ఉండగా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. టెంపరేచర్ పెరిగిపోవడంతో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీలో పరిసర ప్రాంతాలకు గ్యాస్‌‌‌‌ వేగంగా వ్యాపించిం ది. ఈ వాయువు పీల్చడంతో చర్మంపై దద్దుర్లు , కండ్లమంటలు, శ్వాస సంబంధ సమస్యలతో జనం ఊపిరాడక అల్లాడిపోయారు. గ్యాస్ లీకైనప్పుడు ఫ్యాక్టరీల నుంచి అలారం మోగాల్సి ఉంటుంది.  కానీ ఎలాంటి అలారమ్ మోగలేదు. లాక్ డౌన్ కారణం ఇన్నాళ్లూ ఫ్యాకరీని తెరువలేదని, దీంతో  గ్యాస్అలానే నిల్వ ఉందని, గ్యాస్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేశామని, అయినా దురదృష్టవశాత్తు లీక్ అయిందని ఫ్యాక్టరీ ప్రతినిధులు చెప్పారు. గ్యాస్ లీకైన టైంలో అక్కడ 15 మంది వరకు స్టాఫ్ ఫ్యాకరీలో ఉన్నట్లు  తెలుస్తోంది. వారిలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఎల్జీ పాలిమర్స్‌ ‌‌‌ఫ్యాకరీపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి.