హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రం ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే స్వామి వివేకానంద కలలు గన్న విశ్వగురు స్థానాన్ని భారత్ తిరిగి చేరుకోగలదని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హెచ్ఆర్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సభ్యుడు డాక్టర్ బాలసుబ్రమణ్యం అన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రాన్ని ఆధునికీకరించి ఆదివారం పున:ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

సేవ ఎలా చేయాలో రామకృష్ణ మఠాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రతి జీవిలోనూ శివుడు ఉన్నాడని భావిస్తూ సేవ చేయాలని బనారస్ రామకృష్ణ అద్వైత ఆశ్రమ అధ్యక్షుడు స్వామి విశ్వత్మానంద తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, యాదాద్రి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి జ్ఞానదానంద, భక్తులు పాల్గొన్నారు.