వివేకా హత్య కేసులో కీలక పరిణామం... దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో   కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన  బెయిల్ మంజూరు చేసింది. పాస్​ పోర్టు సరండర్​ చేయాలని..  హైదరాబాద్​ విడిచి వెళ్లకూడదని  హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కు రూ.2 లక్షలు పూచీకత్తుగా సమర్పించాలని పేర్కొంది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది. బెయిల్ లభించిన నేపథ్యంలో శివశంకర్ రెడ్డి రేపు ( మార్చి 12)  చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.  వైఎస్ వివేకా హత్య  కేసులో నిందితుడిగా భావించి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని 2021 సెప్టెంబరు 17న హైదరాబాదులో అరెస్ట్ చేశారు.