వివేక హత్య కేసు సుప్రీంకోర్టులో విచారణ.. 2025 ఫిబ్రవరి 25 కు వాయిదా

వివేకానంద హత్య కేసులో సునీతా రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి లు దాఖలు చేసిన పిటిషన్ల పై మంగళవారం ( నవంబర్ 19) సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది.  తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఈ కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషనర్ల తరపున న్యాయవాది సిద్దార్ లూథ్ర వాదనలు వినిపించారు.  దర్యాప్తు అధికారిపై ప్రైవేటు కంప్లైంట్‌ ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారన్నారని న్యాయవాది కోర్టుకు వివరించారు.

వివేకానంద హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేశారంటూ.. ఆయనకు రక్తపు వాంతులు అయ్యాయని ప్రచారం చేశారని న్యాయవాది లూథ్ర తెలిపారు.   కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోందని, ఆ పరిణామలన్నింటిని దృష్టిలో పెట్టుకుని  లేనిపోని ఆరోపణలతో ప్రైవేటు పిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు.  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది. 

వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ పీ  ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కొడుకు జైలుకు వెళ్లి బెదిరించాడని  న్యాయవాది సిద్దార్ధలూథ్ర ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. ఒక డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. వెళ్లిన డాక్టర్‌ రెగ్యులర్‌గా వెళ్లే వారా... కాదా... అని ప్రశ్నించిన సిజెఐ ప్రశ్నకు ... డాక్టర్‌ చైతన్య జైలు నిబంధనలకు విరుద్దంగా వెళ్లారని సునీత తరపు న్యాయవాది  లూథ్ర అన్నారు.  ఈ కేసులో డాక్టర్‌ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని  సునీత తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.