జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల ఇష్టారాజ్యం

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్టు దగ్గర సందర్శకులు ఇష్టారాజ్యంతో వ్యవహరిస్తున్నారు. నిషేధిత ప్రాంతానికి సందర్శకులు వెళ్తున్నా.. పోలీసులు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని అంటున్నారు. సోమవారం పలువురు ఏకంగా గేట్లు ఓపెన్  చేసే స్థలం వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడం కలకలం రేపుతోంది. గేట్లు ఓపెన్  చేసే చోటికి కేవలం సిబ్బంది మాత్రమే వెళ్తారు.

సందర్శకులు పైకి ఎక్కి ఫొటోలు దిగుతున్నా ఎవరూ పట్టించుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పాత్ వే పైకి వెళ్లి ప్రమాదకరంగా తిరుగుతున్నారు. సందర్శకులు ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే సందర్శకులను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.