Mechanic Rocky X Review: మెకానిక్ రాకీ X రివ్యూ.. విశ్వ‌క్‌సేన్ మూవీ టాక్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రస్తుత వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు. ఇటీవలే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు.

తాజాగా విశ్వక్ మరో కొత్త సినిమా మెకానిక్ రాఖీ (MechanicRocky)తో ఇవాళ శుక్ర‌వారం (Nov 22న) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ద‌ర్శ‌కుడు ర‌వితేజ ముళ్ల‌పూడి. మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా న‌టించారు. క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది X రివ్యూలో తెలుసుకుందాం.

రాకీ అనే వ్యక్తి డ్రైవింగ్ స్కూల్ స్థ‌లాన్ని లోకల్ దాదా క‌బ్జా చేసి సీజ్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఎలాగైనా దాన్ని కాపాడుకోవడానికి అతనికి రూ.40 లక్షలకు ఇచ్చి, తన డ్రైవింగ్ స్కూల్‌ని కాపాడుకోవాలని చూస్తాడు రాకీ.

ఈ క్రమంలో రాఖీ తండ్రి జీవితం వెన‌కున్న ఉన్న కొన్ని సీక్రెట్స్ గురించి తెలుసుకుంటాడు. ఇక తన జీవితంలో అనుకోకుండా ఇద్దరు అమ్మాయిలు వస్తారు. తన స్థలాన్ని కాపాడుకోవడానికి రౌడీల‌ను ఎదురించి రాకీ ఎలా పోరాడ‌డ‌న్న‌ది యాక్ష‌న్, కామెడీ నేపథ్యంలో డైరెక్టర్ ఆసక్తిగా చూపించినట్లు నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. 

ఫస్ట్ హాఫ్ బోరింగ్ అని.. ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోవటం వల్ల ఓపికకు పరీక్షా పెడుతుందని.. అయితే, సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదని.. సినిమాలో ఉన్న ట్విస్ట్లు ఇంప్రెసివ్ గా వున్న స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం వల్ల పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 

ఫస్ట్ హాఫ్ ఒకే.సెకండ్ హాఫ్ ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ఉందని.. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన చిన్న సినిమాల కంటే చాలా బెటర్ అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు.

మెకానిక్ రాఖీ ఫస్ట్ హాఫ్ ఒకే..సెకండ్ హాఫ్ లోనే ఉంది మ్యాజిక్ అంతా.. న్యూ కాన్సెప్ట్ తో వచ్చిన డైరెక్టర్ రెండు ట్విస్టులతో అదరగొట్టాడు. సెకండ్ హాఫ్.. పైసా వసూల్ అని, హీరో విశ్వక్ సేన్ తన పెర్ఫార్మన్స్ తో ఇరగదీశాడని.. హీరోయిన్స్ ఇద్దరూ బాగా నటించారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఫ‌స్ట్ హాఫ్ కామెడీ, ల‌వ్ రొమాంటిక్ సీన్స్‌తో డైరెక్ట‌ర్ ర‌వితేజ ముళ్ల‌పూడి టైమ్‌పాస్ చేశాడ‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండాఫ్ మాత్రం ప్ర‌తి ప‌దినిమిషాల‌కు ఓ ట్విస్ట్‌తో సినిమా థ్రిల్లింగ్‌ను పంచుతుంద‌ని అంటున్నారు.