ఏపీ గవర్నర్ గా విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేశారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ …. విశ్వభూషణ్ తో గవర్నర్ గా ప్రమాణం చేయించారు. విజయవాడ రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారం, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులు, అధికారులకు రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేశారు.
