సంక్షేమ హాస్టల్ స్టూడెంట్లను చిన్నచూపు చూడొద్దు : విశారదన్ మహారాజ్

  • విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలి: విశారదన్ 

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులను చిన్నచూపు చూడొద్దని, వారికి ప్రతి రోజూ పౌష్టికాహారాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దాదాపు 10 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సంక్షేమ హాస్టల్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వంద శాతం పౌష్టికాహారం అందాలంటే సీఎం మొదలుకుని సర్పంచ్ వరకు అందరూ ప్రతి రోజూ క్రమం తప్పకుండా మధ్యాహ్నం ఒక పూట సంక్షేమ హాస్టళ్లలోనే భోజనం చేయాలన్నారు.

లేకపోతే హాస్టళ్ల నుంచి లంచ్ బాక్స్ తెప్పించుకుని తింటే తెలంగాణలో ఒక సామాజిక విప్లవం వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఈ పద్ధతిని అమలు చేస్తే హాస్టల్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రుచికరమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందుతుందన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు.