ప్రారంభించిన విశాక జాయింట్ ఎండీ వంశీకృష్ణ
హైదరాబాద్, వెలుగు: సిటీ శివారు పహాడీ షరీఫ్ లో వీనెక్స్ట్ బోర్డ్స్ హోల్ సేల్, రిటైల్ అవుట్లెట్ ఎన్.జి. స్టీల్ అండ్ సిమెంట్ ను విశాక ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీ. వంశీకృష్ణ ఆదివారం ప్రారంభించారు. కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ జేపీ రావు, వీనెక్స్ట్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూటర్, ఎన్.ఎస్ పటేల్ గ్రూప్ ఎండీ జస్మత్ భాయ్ పటేల్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. గత 40 ఏళ్ల నుంచి విశాక గ్రూప్ తో కలిసి పనిచేస్తున్నామని, ప్రస్తుతం సిటీలో 80 అవుట్ లెట్ లలో వీనెక్స్ట్ బోర్డ్స్ అందుబాటులో ఉన్నాయని జస్మత్ చెప్పారు. ప్లైవుడ్ మాదిరే వీ బోర్డ్స్ ఉంటాయని తెలిపారు. కానీ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ వీటి సొంతమని అన్నారు. 50 ఏళ్ల గ్యారెంటీ ఉంటుందని తెలిపారు. వీబోర్డ్స్ కు మంచి మార్కెట్ ఉందని వివరించారు. ప్లైవుడ్ కంటే తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కాగా వీనెక్స్ట్ బోర్డ్స్ ను ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అప్లికేషన్స్ కు వాడుతున్నట్టు చెప్పారు. అన్ని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లకు వీటిని వాడుతున్నట్టు పేర్కొన్నారు. డెకరేటివ్, సీలింగ్, వాల్స్కు వాడొచ్చని అన్నారు. వీనెక్స్ట్ ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, సర్టిఫై చేశాయి. వీనెక్ట్స్ ప్రొడక్ట్ లు ప్లైవుడ్, జిప్సంలకు బెస్ట్ రీప్లేస్మెంట్ గా ఉంటున్నాయి.
