అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగేయాలి : సరోజ వివేకానంద్

  • విశాక ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం సరోజ వివేకానంద్

అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయాలని విశాక ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం సరోజ వివేకానంద్ అన్నారు. ‘‘నాకు 20 ఏండ్లకే పెళ్లి అయింది.. చాలా రిస్ట్రిక్షన్స్ తో పెరిగి, పెళ్లి అయి.. చిన్న కోడలుగా రాజకీయ కుటుంబంలో అడుగుపెట్టాను. మగవారి సపోర్ట్ తోనే మనం ఎదుగుతాం.. నా భర్త నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి నాకు లెక్కలు అంటే ఇష్టం లేదు.. కానీ కంపెనీలోకి అడుగు పెట్టాక నేర్చుకొని ముందడుగు వేశాను. తెలీదని ధైర్యంగా చెబితేనే నేర్చుకోగలం.. ముందడుగు వేయగలం.

నేను భయంగా ఉండే దాన్ని.. మావారి సపోర్ట్, మామ ప్రోత్సాహంతోనే బిజినెస్ లో అడుగు పెట్టాను’’ అని తెలిపారు. ‘‘మా వారు ఇంగ్లిష్ మీడియంలో చదివారు.. పాలిటిక్స్ లోకి వచ్చాక మొదట్లో తెలుగులో మాట్లాడానికి ఇబ్బంది పడ్డారు. తెలుగు అవసరం లేదనుకున్న రోజుల నుంచి మా పిల్లలు పెర్ఫెక్ట్ గా తెలుగు నేర్చుకున్నారు. చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఎంపీ వంశీ కృష్ణ పాలిటిక్స్ లోకి వచ్చాక తెలుగు అనర్గళంగా మాట్లాడుతున్నారు.

మా పాప వైష్ణవి తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. వీ6 చానెల్, న్యూస్ పేపర్ ‘వెలుగు’ కోసం తెలుగు నేర్చుకుంది. అంబేద్కర్ విద్యాసంస్థల్లో తెలుగుపై ప్రేమతో తెలుగు మీడియం నడుపుతూ.. ప్రతీ పండుగ విద్యార్థులకు తెలిసేలా సెలబ్రేట్ చేస్తున్నం” అని ఆమె పేర్కొన్నారు.