సికింద్రాబాద్-భువనేశ్వర్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం-తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ల మధ్య ఇంజిన్-భోగీలు డిటాచ్ అయ్యాయి. బోగీలతో డీలింక్ అయిన రైలింజిన్ అలాగే వెళ్లిపోయింది. దాదాపు 5 కిలోమీటర్లకు పైగా భోగీలు లేకుండానే ఇంజన్ ప్రయాణించింది. భోగీల్లోని ప్రయాణికులు రైల్వే హెల్ప్ లైన్ కు కంప్లైంట్ చేయడంతో… అధికారులు అలర్ట్ అయ్యారు. ఇంజిన్ ను నిలిపేయించారు. తర్వాత ఇంజిన్ కు భోగీలను లింక్ చేసి… రైలును పంపించారు. విశాఖ ఎక్స్ ప్రెస్ భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.
