ఐడియాల ఎక్స్ పెరిమెంట్​ కోసం విశాక క్లయిమేట్ ల్యాబ్

ఐడియాల ఎక్స్ పెరిమెంట్​ కోసం విశాక క్లయిమేట్ ల్యాబ్

హైదరాబాద్​, వెలుగు: అనంత్​ యూనివర్సిటీ అహ్మదాబాద్​ క్యాంపస్​లో క్లయిమేట్​ ల్యాబ్​ ఏర్పాటు చేస్తున్నట్లు విశాక ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ ప్రకటించింది. ఈ ల్యాబ్​ ఏర్పాటుకు ఎకో–ఫ్రెండ్లీ విశాక వీనెక్స్ట్​ ఫైబర్​ సిమెంట్ ​బోర్డులతో ఫ్యాబ్రికేషన్​ చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, మొత్తం ల్యాబ్​కు అవసరమైన విద్యుత్​ను ఇచ్చేలా ఆటమ్​ సోలార్​ రూఫ్ ​కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 
ఆటమ్​ సోలార్​ రూఫ్​కు విశాక ఇండస్ట్రీస్​ పేటెంట్​ పొందిన విషయం తెలిసిందే.  ‘క్లయిమేట్​ ఛేంజ్​ ప్రభావం ఉందనే విషయాన్ని కాదనలేము. మన జీవితాలపై ప్రతి రోజూ ఈ ఎఫెక్ట్​ పడుతోంది. క్లయిమేట్​ ల్యాబ్​ ఏర్పాటుకు చొరవ తీసుకున్నందుకు అనంత్​ యూనివర్శిటీని అభినందిస్తున్నాను’ అని విశాక ఇండస్ట్రీస్​ జాయింట్​ మేనేజింగ్​ డైరెక్టర్​ వంశీ గడ్డం చెప్పారు. ఎకో ఫ్రెండ్లీ బోర్డులు, సోలార్​ రూఫ్​ ప్రొడక్టులతో ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఆనందం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. 
సస్టెయినబుల్​ బిల్డింగ్​ మెటీరియల్స్​ రంగంలో విశాక ఇండస్ట్రీస్​కు 40 ఏళ్ల అనుభవం ఉందని గుర్తు చేశారు. క్లయిమేట్​ ఛేంజ్​ ఎఫెక్ట్​ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ రంగంలో స్టడీ, రీసెర్చ్​పెరగాల్సిన అవసరంతో పాటు, సస్టెయినబుల్​ సొల్యూషన్స్​ ఆవశ్యకతా పెరిగిందని అనంత్​ యూనివర్శిటీ ప్రతినిధి డా అనునయ చౌబే అన్నారు. అనంత్​ క్లయిమేట్​ ల్యాబ్​ ఆ దిశలో తీసుకున్న చొరవగా పేర్కొన్నారు. ఇక్కడ స్టూడెంట్లు తమ ఐడియాలను ఎక్స్​పెరిమెంట్​ చేసుకోవచ్చని వివరించారు.