హైదరాబాద్, వెలుగు: పర్యావరణానికి ఉపయోగపడే బిల్డింగ్ మెటీరియల్స్తయారు చేసే విశాక ఇండస్ట్రీస్, ‘ఆటమ్లైఫ్’ పేరుతో సస్టైనబుల్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను సికింద్రాబాద్‌లోని ఎస్పీ రోడ్డులో స్టార్ట్ చేసింది. సబ్బులు, షాంపూలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్ వరకు సర్టిఫైడ్ సస్టైనబుల్ప్రొడక్టులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సస్టైనబుల్ ప్రొడక్టులను తయారు చేసే స్టార్టప్‌లకు కూడా చేయూత ఇస్తామని ఆటమ్ లైఫ్ ప్రకటించింది. ఈ సందర్భంగా విశాక జాయింట్ ఎండీ వంశీ గడ్డం మాట్లాడుతూ ‘‘సాధారణ ప్రొడక్టుల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. భవిష్యత్‌కు మెరుగైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వెంచర్‌ను మొదలుపెట్టాం. మనం ఇలాగే ప్రకృతిని నాశనం చేస్తూ పోతే రాబోయే తరాలకు ఏమీ మిగలదు. పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచనతోనే ఆటమ్ లైఫ్‌ను స్టార్ట్ చేశాం. సస్టైనబిలిటీ అంటే చాలా మందికి అర్థం కాదు. పర్యావరణానికి హాని చేయని జీవన విధానాన్ని అలవర్చుకోవడమే సస్టైనబిలిటీ! ఈ ఏడాదిలోపు అన్ని మెట్రో సిటీల్లో ఆటమ్లైఫ్ స్టోర్లను తెరుస్తాం. వీటికి కరెంటును మా కంపెనీ తయారు చేసే ఆటమ్ సోలార్ రూఫ్ ద్వారా తీసుకుంటాం”అని ఆయన వివరించారు.
