IND vs AUS: కోహ్లీ సిక్సర్.. డైరెక్ట్‌గా సెక్యూరిటీ తలకు తగిలిన బంతి

ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్టులో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఫామ్ అందిపుచ్చుకుంటూ అద్భుతంగా ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ చేసి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ భారత్ ను ముందుండి నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో 94 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని చూడచక్కని షాట్లతో అలరించాడు. 

కోహ్లీ ఆడిన ఒక సూపర్ షాట్ ను సంతోషించేలోపు అంతలోనే చిన్న విచార సంఘటన ఒకటి జరిగింది. ఇన్నింగ్స్ 101 ఓవర్ లో నాలుగో బంతిని ఆఫ్ సైడ్ వేశాడు. ఈ బంతిని కోహ్లీ పాయింట్ దిశగా అద్భుతమైన సిక్సర్ ను మలిచాడు. అయితే ఆ బంతి నేరుగా అక్కడే ఉన్న సెక్యూరిటీ తలకు తగిలింది. అతను అటుగా తిరిగి ఉండడంతో వెనకనుంచి బంతి తగిలింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత వైద్యులు వచ్చి అతని పరిస్థితి తెలుసుకొని చికిత్స చేశారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు టీ విరామం తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (39), సుందర్ (6) ఉన్నారు. భారత్ ఆధిక్యం ప్రస్తుతం 405 పరుగులకు చేరింది. క్రీజ్ లో కోహ్లీ (66), సుందర్ (26) ఉన్నారు.